పల్లె పోరు ప్రారంభం
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:23 AM
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొదటి విడతలో 3,967 సర్పంచ్, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. మొదటి విడతలో 3,967 సర్పంచ్, 40,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17వ తేదీవరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న పరిశీలన, 19న అప్పీళ్లకు అవకాశం ఉంటుంది. 20న అప్పీళ్లను పరిష్కరిస్తారు. 21వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. నవంబరు 26న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. రీపోలింగ్ అవసరమైతే 27న నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఖర్చులపై పరిమితి
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. 10 వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యుడు గరిష్ఠంగా రూ.60 వేలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలో రూ.1 లక్ష వరకు ఖర్చు చేయవచ్చు. సర్పంచ్ అభ్యర్థులకు ఈ పరిమితి వరుసగా రూ.2.50 లక్షలు, 4 లక్షలుగా నిర్ణయించారు. నామినేషన్ డిపాజిట్ కూడా ఖరారు చేశారు. వార్డు సభ్యులు ఇతరులకు రూ.1000లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.500లుగా నిర్ణయించారు. సర్పంచ్ అభ్యర్థులు ఇతరులకు రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1500గా నిర్ణయించారు.
మహిళలకు పెద్దపీట
సర్పంచ్ స్థానాల్లో 6,445 స్థానాలను మహిళలకు కేటాయించారు. వార్డు సభ్యుల స్థానాల్లో 66,170 స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. సర్పంచ్ స్థానాల్లో ఎస్టీలకు 1,180, ఎస్సీలకు 2,466, బీసీలకు 3,105, మహిళా జనరల్‌కు 3,299, అన్ రిజర్వుడ్‌కు 3,117 స్థానాలు ఉన్నాయి. వార్డు సభ్యుల స్థానాల్లో ఎస్టీలకు 10,472, ఎస్సీలకు 24,527, బీసీలకు 31,858, మహిళా జనరల్‌కు 35,501, అన్‌రిజర్వుడ్‌కు 30156 స్థానాలు కేటాయించారు. మొత్తం 2,61,52,377 మంది ఓటర్లలో మహిళలు 1,32,74,208 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 1,28,76,887 మంది కాగా, ఇతరులు 1,282 మంది ఉన్నారు.
ఓటరు చిటికెన వేలికి సిరా
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమచేతి చూపుడు వేలికి, రీపోలింగ్ జరిగిన కొన్ని ప్రాంతాల్లో మధ్య వేలికి ఇంకు గుర్తువేశారు. అదే ఓటర్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకోనున్న నేపథ్యంలో ఎలాంటి గందరగోళానికీ తావులేకుండా చిటికెన వేలుకు గుర్తు వేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు ఎస్ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇవ్వాలని, ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్