Share News

203 ఆస్పత్రులకు 34 కోట్ల జరిమానా

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:45 AM

అక్రమాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కొరడా ఝళిపిస్తోంది. ఈ మేరకు 2024-25 నుంచి 2026-27 వరకు 203 ఆస్పత్రులపై రూ.34.39 కోట్ల జరిమానాలు విధించింది.

203 ఆస్పత్రులకు 34 కోట్ల జరిమానా

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అక్రమాలకు పాల్పడుతున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు కొరడా ఝళిపిస్తోంది. ఈ మేరకు 2024-25 నుంచి 2026-27 వరకు 203 ఆస్పత్రులపై రూ.34.39 కోట్ల జరిమానాలు విధించింది. 44 ఆస్పత్రులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో పద్మావతి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో, బిల్లుల సమర్పణలో, నిర్దేశిత ప్రమాణాలను పాటించడంలో అక్రమాలకు పాల్పడే నెట్‌వర్క్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో అవకతవకలను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తూ, జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ సహకారంతో బిల్లుల పరిశీలన, వైద్య తనిఖీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.

వైద్య సేవ ట్రస్ట్‌ కింద ఉచితంగా అందించాల్సిన చికిత్సలకు డబ్బులు వసూలు చేయడం, అర్హులకు నగదు రహిత వైద్యానికి నిరాకరించడం, చికిత్సలో జాప్యం, రోగుల సంరక్షణలో నిర్లక్ష్యం వంటి ఫిర్యాదులను ట్రస్టు క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. రోగులకు అవసరానికి మించి చికిత్సా ప్యాకేజీల వినియోగం, అనుమానాస్పద బిల్లులపై నిఘా పెంచామన్నారు. బిల్లుల పరిశీలనను వేగవంతం చేయడం, తనిఖీల్లో ఒకే ప్రమాణాలను పాటించడం, పెండింగ్‌ బిల్లులను పరిష్కరించడం లక్ష్యంగా ఏఐ ఆధారిత విధానాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రులపై చర్యలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు నివేదికల ద్వారా పంపిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 03:45 AM