Share News

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు భారీ నిధులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:49 PM

ఏపీలో ఆగస్టుకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం రూ.2,712.73 కోట్ల నిధులను విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు భారీ నిధులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
NTR Bharosa Pension

అమరావతి, జులై 30: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు భారీ నిధులు విడుదల చేయగా.. 62 లక్షల మందికి లబ్ది చేకూరనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆగస్టుకు సంబంధించి 62,07,573 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించనున్నట్లు వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్రలో 11,98,044 మంది లబ్ధిదారులకు గురువారమే రూ.514.42 కోట్ల పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.


రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఆగస్టు 1న రూ.2,198.31 కోట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విడతలో 50,09,529 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ పెన్షన్ల కోసం రూ.70,907.41 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్రతి నెలా 1వ తేదీన లబ్ధిదారులకు పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

Read Latest Telangana News And National News

Updated Date - Jul 30 , 2026 | 07:47 PM