Minister Narayana: అమరావతిలో రెండో విడత భూ సమీకరణ.. ప్రారంభించిన మంత్రి నారాయణ..
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:43 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం సుమారు 16,666 ఎకరాలను సమీకరించనుంది. ఇందుకోసం ఈ రోజు (బుధవారం) రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు (Vaddamanu land pooling).
ఈ ఏడు గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడా పోటీల కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే ఒలంపిక్స్ నిర్వహణ కూడా జరుగుతుందని అన్నారు. రైతులు భూములపై తీసుకున్న రుణాలను గతంలో రూ.1.5 లక్షల వరకు మాఫీ చేశారని, ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆకాంక్షించారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం, నిధులు విడుదల చేయవద్దని వరల్డ్ బ్యాంక్‌కు లేఖలు రాయడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు (Andhra Pradesh projects).
గ్రామాల్లోని అంతర్గత నిర్మాణాలు, రోడ్‌లు, డ్రైన్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని శ్రావణ్ కుమార్ సూచించారు (land pooling initiative). హరిశ్చంద్రపురం ఈనాం భూములు విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని, తాడికొండ నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ చేసిన 3 గ్రామాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇతడు మనిషేనా.. ఇంటిపై వేలాడుతూ బల్లిలా ఎలా చేస్తున్నాడో చూడండి..
ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు.. నిర్బంధంపై ఆగ్రహ జ్వాలలు..