Share News

రికార్డు స్థాయిలో పన్నుల వసూళ్లు!

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:32 AM

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుకు గాను ఏకంగా రూ.4,986.18 కోట్ల స్థూల వాణిజ్య పన్ను ఆదాయం సమకూరింది.

రికార్డు స్థాయిలో పన్నుల వసూళ్లు!

  • ఈ ఆర్థిక ఏడాది మొదటి ఆర్నెల్లలో రూ.30,435 కోట్ల ఆదాయం

  • సెప్టెంబరులో 15.03 శాతం వృద్ధి

  • నికర జీఎస్టీ వృద్ధిరేటులో జాతీయ సగటు కంటే ముందంజలో ఏపీ

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుకు గాను ఏకంగా రూ.4,986.18 కోట్ల స్థూల వాణిజ్య పన్ను ఆదాయం సమకూరింది. గతేడాది సెప్టెంబరులో వసూలైన రూ.4334.84 కోట్లతో పోలిస్తే భారీగా 15.03 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరులో రూ.651.34 కోట్ల అదనపు ఆదాయం లభించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో మొత్తం వాణిజ్య పన్నుల వసూళ్లు రూ.30, 435.98 కోట్లకు చేరాయి. ఇది గతేడాది కంటే 18 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 2026 సెప్టెంబరులో రూ.3,182.87 కోట్ల నికర జీఎస్టీ వచ్చింది. గతేడాది కంటే ఇది 14.1 శాతం ఎక్కువ. ఐజీఎస్టీ సెటిల్మెంట్‌ రూ.20.1 శాతం వృద్ధి చెంది, రూ.1927.62 కోట్లు సాధించింది. పెట్రోలియంపై వ్యాట్‌ రూ.1666.91 కోట్లు వచ్చింది. ఇది గతేడాది కంటే 20.77 శాతం పెరిగింది. వృత్తి పన్ను 3.99 శాతం వృద్ధితో రూ.43.53 కోట్లకు పెరిగింది. మద్యంపై వ్యాట్‌ 3.7 శాతం స్థిరమైన వృద్ధితో రూ.86 కోట్లకు చేరింది. నికర జీఎస్టీ వృద్ధిరేటులో ఏపీ 14.10 శాతం సాధించి జాతీయ సగటు 8 శాతం కంటే ఎంతో ముందంజలో నిలిచింది.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 04:34 AM