ఇప్పుడు ఏమంటారు జగన్?!
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:55 AM
‘‘150కి పైగా అసెంబ్లీ సీట్లు గెలిచిన పార్టీ ఒక్కసారిగా 11 సీట్లకు ఎలా పడిపోతోంది. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర. ఎన్నికలకోసం వాడిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. నిజమైన ఫలితాల కోసం బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి అని...
బ్యాలెట్ ఫైట్‌లో తుస్సుమన్న వైసీపీ
2024 సాధారణ ఎన్నికల సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఆరోపణ
110పైనే సీట్లు వస్తే 11 చేశారంటూ గగ్గోలు
బ్యాలెట్ తో మరోదఫా ఎన్నికలకు డిమాండ్
స్ధానికంలో బ్యాలెట్ పోరే ఉండాలన్న జగన్
ఇప్పుడు అలాగే జరిగినా తిరగని ‘ఫ్యాన్’
సొంత ఊర్లో ఓటే వేయని జగన్
‘మావిగన్’ ప్రాంతాల్లోనూ వైసీపీ చుక్కలే
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో కూటమి పార్టీలకే జై కొట్టిన ప్రజలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘‘150కి పైగా అసెంబ్లీ సీట్లు గెలిచిన పార్టీ ఒక్కసారిగా 11 సీట్లకు ఎలా పడిపోతోంది. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర. ఎన్నికలకోసం వాడిన ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. నిజమైన ఫలితాల కోసం బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి. అప్పుడే నిజమైన ఫలితాలు వస్తాయి.’’ అని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 2024, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పలు సందర్బాల్లో చేసిన ఆరోపణలు ఇవి. అయితే, రెండున్నరేళ్ల తర్వాత ఆయన కోరుకున్నట్టే.. మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ పైనే ఎన్నికలు జరిగాయి.
ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే, ఫలితాలు మాత్రం జగన్ ఊహకు అందని రీతిలో వచ్చాయి. ఆయన సొంతగడ్డ పులివెందుల మున్సిపాలిటీనే వైసీపీ చేజారి పోయింది. పులివెందులలో ముచ్చటగా మూడు వార్డులనే గెలుచుకున్నారు. ఓటేయడానికి పులివెందులకు వెళ్లి అక్కడి ‘సీన్’ అర్ధమై.. కనీసం ఓటెయ్యకుండానే వెనుదిరిగారు. అదేమంటే రీ పోలింగ్ పెడితేనే ఓటు వేస్తానని నిరసన నాటకం రక్తికట్టించే ప్రయత్నం చేశారు. కానీ, అదీ విఫలమైంది. రాష్ట్రంలో పులివెందుల పులిబిడ్డగా వైసీపీ కార్యకర్తలతో కీర్తించుకుంటున్న జగన్ సొంత గడ్డపై ఆయన కోరుకున్న బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే కనీసం ఓటు కూడా వేయలేదు.
పులివెందుల మున్సిపాలిటీని చేజార్చుకున్నారు. అంటే, జగన్ ఓటేసినా, వేయకున్నా ఫలితం ఎలా ఉంటుందో ముం దు అర్ధమయి ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాధారణ ఎన్నికల కంటే దారుణమైన ఫలితాలను వైసీపీ అధినేత మూటగట్టుకున్నారు. మరి ఇప్పుడేమంటారు? నాడు ఈవీఎంలతో సాధారణ ఎన్నికలు జరిగితే టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రచేసి ట్యాంపరింగ్ చేశారని అభాండాలు వేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఎన్నికల్లో నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేసిందో జగన్ చెప్పలేకపోయారు. ఇప్పుడు ఆయన కోరుకున్న బ్యాలెట్ ఎన్నికలు జరిగినా తీవ్ర నిరాశ, నిస్పృహలోకి తీసుకెళ్లేలా బ్యాలెట్ ఫలితాలు వచ్చాయి.
‘మావిగన్’ ఎదురుతన్నింది!
ఈ ఎన్నికల్లో జగన్ చేసిన మరో ప్రయోగం మావిగన్. అధికారంలో ఉండగా మూడు రాజధానుల సరదాను ప్రజలు తమ ఓటుతో తీర్చేసిన తర్వాత కొత్తగా ‘మావిగన్’ ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతి, కర్నూలు, విశాఖలతో కూడిన మూడు రాజధానుల ప్రయోగాన్ని 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. ఆ తర్వాత మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) కారిడార్‌ను రాజధానిగా చేయాలని, దాన్ని మావిగన్‌గా ప్రకటించాలని జగన్ మరో రాజధాని డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు. ఆయన బాటలోనే వైసీపీ నేతలు, అనుకూల నీలిమీడియా మావిగన్ నినాదంతో పరుగులు తీశారు.
కానీ, మచిలీపట్నం మున్సిపాలిటీ, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్‌లను కూటమి దక్కించుకుంది. ఇక ఈ మూడు ప్రాంతాల్లో వార్డులను కైవసం చేసుకోవడంలోనూ వైసీపీ చాలా వెనకబడింది. అంటే, జగన్ నినదించిన ‘మావిగన్’ను కూడా ప్రజలు తిరస్కరించారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం