Share News

రాప్తాడు విద్యార్థిని కోలుకుంటోంది: సవిత

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:32 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక కోలుకుంటోందని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు.

రాప్తాడు విద్యార్థిని కోలుకుంటోంది: సవిత

  • బెంగళూరు ఆస్పత్రిలో బాధితురాలికి పరామర్శ

బెంగళూరు, పెనుకొండ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక కోలుకుంటోందని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు. బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆమె శుక్రవారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే సాధారణ పరిస్థితికి వస్తావని బాధితురాలికి మంత్రి ధైర్యం చెప్పారు. విద్యార్థిని తల్లిని పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎటువంటి సాయం కావాలన్నా తనకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.

గాయపడ్డ విద్యార్థిని కోలుకుంటోందని.. ఉదయం రసంతో కొంత అన్నం తీసుకుందని, నాలుగు అడుగులు నడిచిందని తెలిపారు. తిరిగి బడికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఆత్రుత కనబరుస్తోందని, పదో తరగతి పరీక్షలు రాయాలని అంటోందని మంత్రి తెలిపారు. తనను కాపాడేందుకు మంత్రి నారా లోకేశ్‌ ఎంతో చొరవ చూపారని, ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని విద్యార్థిని కోరిందని అన్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్టు తరఫున డాక్టర్‌ గంగాధరరెడ్డి విద్యార్థిని వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారని మంత్రి వెల్లడించారు. కాగా, అంతకుముందు మంత్రి.. ఆసుపత్రి వైద్యులను కలిసి బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం కొనసాగించాలని, ఆమె ఆరోగాన్ని మెరుగుపరిచేందుకు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. రాప్తాడు ఎంఈవో మల్లికార్జున తదితరులు మంత్రి వెంట వచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కౌంటింగ్‌కు వేళాయె...

సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు

Updated Date - Nov 07 , 2026 | 01:33 AM