Share News

అమరావతిలో థాయ్‌ సాంస్కృతిక కేంద్రం!

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:25 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో థాయ్‌ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుచేయాలని థాయ్‌లాండ్‌ రాయబారి చవనార్ట్‌ థాంగ్‌సుమ్‌ఫంట్‌ను మంత్రి నారా లోకేశ్‌ కోరారు.

అమరావతిలో థాయ్‌ సాంస్కృతిక కేంద్రం!

  • బుద్ధిస్ట్‌ హెరిటేజ్‌, ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధికి సహకరించండి

  • థాయ్‌లాండ్‌ రాయబారితో లోకేశ్‌ భేటీ

విశాఖపట్నం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో థాయ్‌ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుచేయాలని థాయ్‌లాండ్‌ రాయబారి చవనార్ట్‌ థాంగ్‌సుమ్‌ఫంట్‌ను మంత్రి నారా లోకేశ్‌ కోరారు. సోమవారం మారిటైమ్‌ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన థాయ్‌ బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో బుద్ధిస్ట్‌ హెరిటేజ్‌, ఎయిర్‌ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధికి సహకరించాలని అభ్యర్థించారు. బిహార్‌లోని బుద్ధగయ తరహాలో థాయ్‌ బౌద్ధ సన్యాసులు, యాత్రికుల కోసం ఏపీలో బౌద్ధ టూరిస్ట్‌ సర్క్యూట్‌ అభివృద్ధి చేయాలని.. నాగార్జునకొండ, తొట్లకొండ, బావికొండలను అందులో చేర్చాలని కోరారు. విశాఖపట్నం-థాయ్‌ మధ్య క్రూయిజ్‌ టూరిజం, తీరప్రాంత పర్యాటకం అనుసంధానం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆమె స్పందిస్తూ.. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:28 AM