Share News

మీరు పెట్టిన బకాయిలే చెల్లిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Nov 14 , 2026 | 05:06 AM

వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే ఇంకా చెల్లిస్తున్నామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు.

మీరు పెట్టిన బకాయిలే చెల్లిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే ఇంకా చెల్లిస్తున్నామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. శుక్రవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఫీజుల గురించి జగన్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఐదేళ్లు మీ పబ్లిసిటీ పిచ్చితో మీ బొమ్మలకు ఇచ్చిన ప్రాధాన్యం ఫీజులకు ఇచ్చి ఉంటే బకాయిలు ఉండేవా? మేం రెండున్నరేళ్లలోనే రూ.5 వేల కోట్లు చెల్లించాం. కానీ మీరు పెట్టిన బకాయిలకు మాపై నిందలు వేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని కూడా స్వార్థ రాజకీయానికి వాడుకోవడం మీకు గన్‌తో పెట్టిన విద్య జగన్‌ గారూ’ అని వ్యాఖ్యానించారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 05:08 AM