Share News

జువ్వలదిన్నెలో మారిటైమ్‌ అకాడమీ పెట్టండి

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:02 AM

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మారిటైమ్‌ అకాడమీ, రోబోటిక్స్‌ స్కిల్లింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సాగర్‌ డిఫెన్స్‌ ఫౌండర్‌ కెప్టెన్‌ నికుంజ్‌ పరాశర్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు.

జువ్వలదిన్నెలో మారిటైమ్‌ అకాడమీ పెట్టండి

  • సాగర్‌ డిఫెన్స్‌ ఫౌండర్‌కు మంత్రి లోకేశ్‌ సూచన

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో మారిటైమ్‌ అకాడమీ, రోబోటిక్స్‌ స్కిల్లింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సాగర్‌ డిఫెన్స్‌ ఫౌండర్‌ కెప్టెన్‌ నికుంజ్‌ పరాశర్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. సీఐఐ సదస్సులో భాగంగా వీరిద్దరూ భేటీ అయ్యారు. తూర్పుతీరంలో ఉన్న ఈస్టర్న్‌ నావల్‌ కమాండ్‌, కోస్ట్‌గార్డ్‌ సౌలభ్యం కోసం మానవరహిత నౌకల సీట్రయల్స్‌, ఏఆర్‌ఓ, ఫ్లీట్‌ సపోర్ట్‌ కోసం జువ్వలదిన్నెలో ప్రత్యేక స్థావరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

అక్కడ పుణె లిక్విడ్‌ రోబోటిక్స్‌ కో-ప్రొడక్షన్‌ మోడల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికోసం ఐఐటీ తిరుపతి, ఆంధ్రా యూనివర్సిటీల్లోని మెరైన్‌ ఇంజనీరింగ్‌ విభాగాలతో కలిసి పనిచేయడానికి ముందుకువస్తే సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేజీ బేసిన్‌లో చమురు, గ్యాస్‌ ఆపరేషన్ల కోసం ఆఫ్‌షోర్‌ ఆపరేషన్లు, తుఫాన్‌, వరదల సమయంలో ముందస్తు అప్రమత్తత కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనను పరిశీలిస్తామని నికుంజ్‌ పరాశర్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:03 AM