కుటుంబానికి సమయం కేటాయించడమే కష్టం
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:57 AM
ఒక మంత్రిత్వశాఖ నిర్వహించడం కష్టమా.? ముగ్గురు పిల్లలను చూసుకోవడం కష్టమా.?...అని ఉపాసన కొణిదల ప్రశ్నించగా, కుటుంబానికి సమయం కేటాయించడమే తనకు ...
ఉపాసన కొణిదల ప్రశ్నలకు లోకేశ్ జవాబు
విశాఖపట్నం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఒక మంత్రిత్వశాఖ నిర్వహించడం కష్టమా.? ముగ్గురు పిల్లలను చూసుకోవడం కష్టమా.?...అని ఉపాసన కొణిదల ప్రశ్నించగా, కుటుంబానికి సమయం కేటాయించడమే తనకు అన్నింటికంటే కష్టమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ ఆసక్తికర సంభాషణ విశాఖ సీఐఐ సదస్సు సందర్భంగా జరిగింది.
‘యంగ్ ఆంధ్ర.. థ్రైవింగ్ ఆంధ్ర-ఆరోగ్యం, ఆనందం, మానవ సామర్థ్యంపై కొత్త సంభాషణ’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్, యూఆర్ లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్య, ఉపాధి, మహిళా సాధికారిత, కుటుంబ విలువలు, సాంకేతికత, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం తదితర అంశాలపై ఉపాసన అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు