Share News

రెండో దశనూ సీరియ్‌సగా తీసుకోండి: లోకేశ్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:57 AM

‘రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలనూ ప్రతి ఒక్కరూ సీరియ్‌సగా తీసుకోవాలి. ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని

రెండో దశనూ సీరియ్‌సగా తీసుకోండి: లోకేశ్‌

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ‘రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలనూ ప్రతి ఒక్కరూ సీరియ్‌సగా తీసుకోవాలి. ఎన్నికల్లో కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’ అని తెలుగుదేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ కోరారు. పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల సన్నద్ధతపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

‘పట్టణ, పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసి కూటమి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించారు. కూటమి పట్ల ప్రజలు ఎంతో సానుకూలంగా ఉన్నారు. ప్రతి ఎన్నిక ముఖ్యమే. మీ పరిధిలోని ఆయా బూత్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎన్నికల వ్యూహరచన పకడ్బందీగా ఉండాలి. ప్రతి ఓటూ కీలకమే. ప్రజలను ఎక్కడికక్కడ మొబిలైజ్‌ చేయాలి. రెబల్స్‌ విషయంలో స్థానిక నాయకత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి. కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓటు బదిలీ జరిగేలా కృషి చేయాలి. కూటమిలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలి. బాగా పని చేసిన నాయకులకు భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తాం. నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తాం. మొదటి దశ కంటే రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రావాలి’ అని లోకేశ్‌ మార్గనిర్దేశం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 04:01 AM