ఓట్లే దీపాలుగా వైసీపీ అహంకారం దహనం: అచ్చెన్న
ABN , Publish Date - Nov 08 , 2026 | 01:51 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. చెడుపై మంచి సాధించిన విజయంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు.
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. చెడుపై మంచి సాధించిన విజయంగా వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలు, రైతులు, మత్స్యకారులకు, పశుపోషకులకు శనివారం ఓ ప్రకటనలో ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఓట్లనే దీపాలుగా వెలిగించి, వైసీపీ రాజకీయ అహంకారాన్ని ప్రజలు దహనం చేశారు. కేసులు, వివాదాల నీడలో ఉన్న జగన్‌కు మరోసారి అధికారం అప్పగించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్థానిక ఎన్నికల ఫలితాలతో రుజువైంది. నరకాసురుడి అహంకారానికి అంతం పలికినట్లే.. జగన్ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు. అన్యాయం ఎంత బలమైనదైనా అంతిమ విజయం ధర్మానిదేననే సందేశాన్ని ఇస్తుంది. అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో ఈ దీపావళి కొత్త వెలుగులు నింపాలి’ అని ఆయన ఆకాంక్షించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..