గొడ్డలిపార్టీకి ప్రజాసేవ తెలియదు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:02 AM
అర్నబ్ తుఫాన్ వచ్చి భారీ నష్టం చేకూరిస్తే గొడ్డలిపార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారని రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.
తుఫాన్ వస్తే పత్తా లేరు: మంత్రి అనగాని
రేపల్లె, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ వచ్చి భారీ నష్టం చేకూరిస్తే గొడ్డలిపార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారని రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. గురువారం బాపట్ల జిల్లా రేపల్లెలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అర్నబ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేస్తూ 20వేల విద్యుత్ స్తంభాలను వేసి, 8 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని చెప్పారు.
దెబ్బతిన్న తాగునీటి పైప్‌లైన్లకు మరమ్మతులు నిర్వహించి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నామన్నారు. గొడ్డలిపార్టీ నాయకులకు ప్రజాసేవ అంటే తెలియదని, ఆ పార్టీ చేష్టలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు