Share News

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 3,543 ఎంబీబీఎస్‌ సీట్లు

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:59 AM

ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు హెల్త్‌ వర్సిటీ నిర్వహించిన మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తియ్యేసరికి 4,581 కన్వీనర్‌ కోటా సీట్లలో 3,543 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కేటాయించినట్లు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ బుధవారం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 3,543 ఎంబీబీఎస్‌ సీట్లు

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు హెల్త్‌ వర్సిటీ నిర్వహించిన మూడు రౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తియ్యేసరికి 4,581 కన్వీనర్‌ కోటా సీట్లలో 3,543 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కేటాయించినట్లు వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ పి.చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ బుధవారం తెలిపారు. ఎంబీబీఎ్‌సలో ప్రవేశాలకు సంబంధించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ, కౌన్సెలింగ్‌లో అవలంబించిన విధానాలను, కేటాయింపులను వివరించారు.

2026 సీట్లలో 1,213 సీట్లు ప్రతిభ ఆధారంగా రిజర్వుడ్‌ వర్గాలకు లభించాయన్నారు. 2025-26లో ఈ సంఖ్య 981 మాత్రమేనని చెప్పారు. గతేడాది వచ్చిన జీవో 102 వల్ల రిజర్వుడు కేటగిరి వారికి ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో అన్యాయం జరుగుతున్నట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 04:59 AM