Share News

మద్యం షాపుల రెన్యువల్‌ నత్తనడక!

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:12 AM

మద్యం షాపుల రెన్యువల్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ప్రస్తుత లైసెన్సీలకే రెన్యువల్‌ అవకాశం ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గడువిచ్చారు. అయితే బుధవారం వరకు 15 శాతం షాపులు అంటే సుమారు 600 షాపుల లైసెన్సీలే రెన్యువల్‌కు ముందుకొచ్చారు.

మద్యం షాపుల రెన్యువల్‌ నత్తనడక!

  • ఇప్పటివరకూ 15 శాతం లైసెన్సీలే ముందుకు

  • 21 వరకే గడువు..తర్వాత లైసెన్స్‌లు ఉండవు

  • దరఖాస్తులు ఆహ్వానించి 30న లాటరీతో ఎంపిక

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రెన్యువల్‌కు ముందుకురాని లైసెన్సీలు లైసెన్సులు కోల్పోతారు. ఆ షాపులకు దరఖాస్తులు ఆహ్వానించి ఈ నెల 30వ తేదీన లాటరీ తీస్తారు. అయితే ఎన్ని షాపులు రెన్యువల్‌ అవుతాయి.. ఎన్ని మిగిలిపోతాయనేది ఆసక్తికరంగా మారింది. లైసెన్స్‌ల రెన్యువల్‌ను వ్యాపారులు మంచి అవకాశంగానే భావించారు.

అయితే రూ.లక్షలు ఖర్చు చేసి దరఖాస్తులు వేస్తున్నా.. షాపులు తమకే వస్తాయన్న గ్యారెంటీ లేదని.. దీంతో రెన్యువల్‌ చేయించుకోవడమే ఉత్తమమని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ గడువు ఇంకా ఉందనో.. లేక ఇతరత్రా కారణాల వల్లో మొదటి ఐదు రోజుల్లో 15 శాతం లైసెన్సీలే ముందుకొచ్చారు. మిగిలినవారు చివరి రోజుల్లో వస్తారని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి. కొత్త పాలసీ ప్రకటిస్తే దరఖాస్తులు చివరి రోజుల్లో ఎక్కువగా వస్తాయని.. రెన్యువల్‌కు కూడా వ్యాపారులు అదే ట్రెండ్‌ కొనసాగిస్తారా.. లేక ఆసక్తి చూపడం లేదా అనేది చూడాలి. లైసెన్స్‌ రెన్యువల్‌కు ప్రత్యేకంగా రిటైల్‌ ఎక్సై జ్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. 50 వేల జనాభా వరకు ఉన్న ప్రాం తాల్లో రూ.23 లక్షలు, 50 వేలు-5లక్షల జనాభా ఉంటే రూ.27.2 లక్షలు.. జనాభా 5 లక్షలు దాటితే రూ.35.5 లక్ష లు చెల్లించాలి. రెన్యువల్‌ ట్యాక్స్‌ అని చెబుతున్నా దరఖాస్తు రుసుముగానే భావించాలి. గతంలో దరఖాస్తుల ద్వారా వచ్చిన మొత్తాన్ని లెక్కించి రెన్యువల్‌ ట్యాక్స్‌ను నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి:

గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్

ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య

Updated Date - Sep 17 , 2026 | 03:12 AM