ప్రజా ఉద్యమంగా ‘బ్రేక్ ది సైలెన్స్’
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:28 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును జమ చేసి.. మద్యం షాపుల లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఓపెన్ క్యాటగిరీ షాపుల యాజమానులను హైకోర్టు ఆదేశించింది. అయితే, లైసెన్స్ రెన్యువల్ ఫీజు ఎంత అనేది తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ప్రజా ఉద్యమంగా ‘బ్రేక్ ది సైలెన్స్’
డ్రగ్స్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం
‘ఈగల్’ పురోగతిపై హోం మంత్రి అనిత సమీక్ష
మంగళగిరి సిటీ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల బారిన పడిన పిల్లల వివరాలను గోప్యంగా ఉంచుతూ వారికి తగిన సాయం అందించేందుకు ఈగల్ ప్రారంభించిన బ్రేక్ ది సైలెన్స్(మౌనం వీడండి) కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఈగల్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ఆమె మంగళగిరిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘బ్రేక్ ది సైలెన్స్-1972 ఫోన్ నెంబర్‌కు సమాచారం ఇవ్వండి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి సంకోచాలు లేకుండా సమాచారం అందిస్తే గోప్యత పాటిస్తూ పిల్లలకు డీ-ఎడిక్షన్, పునరావాస కేంద్రాల్లో సేవలందిస్తామని చెప్పారు. గడిచిన 21 నెలల్లో ఏపీ ఈగల్ బృందం, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవనశాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతా ల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించారని తెలిపారు. వేల ఎకరాల్లో గంజాయి సాగు చేసే ప్రాంతాల్లో ఇప్పుడు అవకాడో, రాంబుటన్ వంటి ప్రత్యామ్నాయ, అధిక విలువ కలిగిన హార్టికల్చర్ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతుల జీవనోపాధికి మార్గం చూపామని చెప్పారు. తదుపరి లక్ష్యంగా గంజాయి రవాణాను అరికట్టడంపై దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు నమోదు చేసిన మూడు వేలకు పైగా కేసుల్లో ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు 17 కేసుల్లో కఠిన శిక్షలు ఖరారయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంతో రాష్ట్రస్థాయి చర్యలను అనుసంధానం చేస్తూ.. విద్యా సంస్థలు, యువతను భాగస్వాములను చేయనున్నామని వెల్లడించారు.
29 వేల మందికి ప్రత్యామ్నాయం
ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ చైతన్యం’ ద్వారా 29,978 మంది రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించామన్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్, సేఫ్ క్యాంపస్ జోన్, ఆపరేషన్ గరుడ కార్యక్రమాలతో విద్యా సంస్థలు, రవాణా మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్టు తెలిపారు. కేసులను కేవలం సరుకు స్వాధీనానికే పరిమితం చేయకుండా నెట్‌వర్క్ ఛేదన, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి, ఇప్పటివరకు 17 ఎన్‌డీపీఎ్‌స కేసుల్లో సుమారు రూ.10.18 కోట్ల విలువైన ఆస్తులు, నిధులను సీజ్ చేశామని వివరించారు. కాగా, ఇటీవల జరిగిన మొదటి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో పతకాలు సాధించిన 16 మంది ఈగల్ అధికారులు, సిబ్బందికి మంత్రి అనిత 41 మెడల్స్‌ను ప్రదానం చేశారు.
ఈ వార్తలనూ చదవండి...