పరిశ్రమల పరిధిలోని 27,384 ఎకరాల్లో పచ్చదనం
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:07 AM
పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య కోరారు.
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య కోరారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచనల మేరకు గత 3 నెలల్లో రాష్ట్రంలోని పరిశ్రమల పరిధిలో 2,234.15 ఎకరాల్లో గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి చేసినట్లు బుధవారం ఆయన తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 2,913 పరిశ్రమల పరిధిలో ఉన్న గ్రీన్ కవర్ విస్తీర్ణం 27,384.34 ఎకరాలకు చేరిందని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి..