Share News

సంక్షేమ హాస్టళ్ల డైట్‌ చార్జీలు పెంపు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:24 AM

రాష్ట్రంలో సంక్షేమ, విద్యా శాఖల పరిధిలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హోమ్స్‌, కేజీబీవీలు, మోడల్‌ పాఠశాలల్లో వసతి పొందుతున్న విద్యార్థుల డైట్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.

సంక్షేమ హాస్టళ్ల డైట్‌ చార్జీలు పెంపు

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షేమ, విద్యా శాఖల పరిధిలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, హోమ్స్‌, కేజీబీవీలు, మోడల్‌ పాఠశాలల్లో వసతి పొందుతున్న విద్యార్థుల డైట్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వీటిని సవరిరిస్తూ సాంఘిక సంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 1 నుంచే కొత్త రేట్లు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు 3 నుంచి 6వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1150గా ఉన్న డైట్‌ చార్జీని రూ.1265కు, 7 నుంచి 10 రూ.1400ల నుంచి రూ.1540కు పెంచింది. ఇంటర్‌, ఆపై విద్యార్థులకు నెలకు రూ.1600గా ఉన్న మొత్తాన్ని రూ.1760కు పెంచింది.

పోషకాహార మెనూ...

విద్యార్థులకు ఆరోగ్యకరమైన, సమతుల్యమైన, వైవిధ్యభరితమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మెనూను నిర్దేశించింది. వారానికి ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్‌, ఏడు రోజులూ పండ్లతోపాటు.. ప్రతిరోజూ పాలు పంపిణీ చేస్తారు. విద్యార్థులకు రోజువారీ మెనూలో భాగంగా పూరీ-ఆలూ బఠాణీ కుర్మా, చికెన్‌ బిర్యానీ, ఇడ్లీ-పల్లీ చట్నీ, రాగి లడ్డూ, బగారా రైస్‌-చికెన్‌ కర్రీ, జీరా రైస్‌-వెజిటబుల్‌ కర్రీ, బన్సీ రవ్వ ఉప్మా, వేడి పొంగల్‌, రవ్వ కేసరి తదితర వంటకాలను చేర్చారు. స్నాక్స్‌, పండ్లు, మజ్జిగ వంటి వాటినీ మెనూలో పొందుపరిచారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:24 AM