రాప్తాడు ఘటనపై నివేదిక సమర్పించండి
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:32 AM
రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
పోలీసులకు హైకోర్టు ఆదేశం.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఉన్మాది హేమంత్ దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లా, రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడిచేసి గాయపరిచిన ఉన్మాది హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఉదంతంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపి కృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా న్యాయవాది సాల్మన్‌రాజు వాదనలు వినిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్