‘తెలుగు’ అమలుపై స్టేటస్ రిపోర్ట్ ఏదీ?
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:57 AM
రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో తెలు గు భాష అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయక పోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జాప్యంపై హైకోర్టు అసంతృప్తి
వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల్లో తెలు గు భాష అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభు త్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయక పోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, యువజన సేవలు, పర్యాటక-సాంస్కృతిక శాఖ ముఖకార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. అధికార భాషా చట్టం-1966కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస్ 2021లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిల్‌పై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. దీనికి సంబంధించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని జూలై 14న ఉత్తర్వులిచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. ఇప్పటికీ సమయం కోరడం, అందుకు తగిన కారణాలు చెప్పక పోవడాన్ని తప్పుబట్టింది. సంబంధిత శాఖల కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి కదా? అని చురకలంటించింది. తాజా వివరాలతో అఫిడవిట్‌దాఖలు చేయాలంటూ.. పిల్‌పై తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ