ఉచిత న్యాయ సహాయం అర్హుల చట్టబద్ధమైన హక్కు
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:15 AM
ఉచిత న్యాయ సహాయం పొందడం అర్హుల చట్టబద్దమైన హక్కు అని, ఆ హక్కు గురించి తెలియపరిచి అవసరమైన న్యాయ సహాయం అందేలా చూడడంలో...
సంస్థాగత శిక్షణా కార్యక్రమంలో జస్టిస్ రవినాథ్ తిల్హరి
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉచిత న్యాయ సహాయం పొందడం అర్హుల చట్టబద్దమైన హక్కు అని, ఆ హక్కు గురించి తెలియపరిచి అవసరమైన న్యాయ సహాయం అందేలా చూడడంలో న్యాయాధికారులది కీలకపాత్ర అని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జిస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. సామాజిక, ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబాటులోకి వచ్చినప్పుడే న్యాయ వ్యవస్థ విజయానికి నిజమైన కొలమానం అని పేర్కొరు.
ఏపీ న్యాయసేవాధికార సంస్థ గురువారం నిర్వహించిన ఒక రోజు సంస్థాగత శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందుతున్న జిల్లా న్యాయాధికారులు, సివిల్ జడ్జీలు(జూనియర్ డివిజన్)ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, మండల సేవా కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలు, ఉచిత న్యాయసేవలు, లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ
బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం