అందుబాటులో అభ్యర్థుల పత్రాలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:23 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు, తదితర వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌లు, నామినేషన్ పత్రాలను ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్ నుండి ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్..
పంచాయతీరాజ్, పురపాలక శాఖల వెబ్‌సైట్లలో వాటిని అప్‌లోడ్ చేస్తారు
హైకోర్టుకు వివరించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
పిల్ కొట్టేసిన హైకోర్టు
అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు, తదితర వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌లు, నామినేషన్ పత్రాలను ఎస్‌ఈసీ అధికారిక వెబ్‌సైట్ నుండి ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. పెద్ద సంఖ్యలో ఉన్న అఫిడవిట్‌లు, నామినేషన్ పత్రాలను ఆయా శాఖల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పురపాలక, పంచాయితీరాజ్ శాఖల కమిషనర్లకు ఎస్‌ఈసీ లేఖ రాసిందన్నారు. ఎస్‌ఈసీ వెబ్‌సైట్ ద్వారా వాటిని వీక్షించేందుకు ప్రత్యేక లింక్ ఇస్తున్నామన్నారు. లింక్ క్లిక్ చేసిన వెంటనే పంచాయితీరాజ్, పురపాలక శాఖ వెబ్‌సైట్‌లకు వెళ్తుందని, అక్కడ అభ్యర్థుల వివరాలు పరిశీలించవచ్చని వివరించారు. పోలింగ్ తేదీకి ముందే ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ ముందే అభ్యర్థుల అఫిడవిట్లను ఓటర్లకు అందుబాటులో ఉంచిన మొదటి రాష్ట్రం ఏపీయే అవుతుందన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది తాండవ యోగేష్ ఎస్‌ఈసీ చెప్పిన వివరాలతో సంతృప్తి వ్యక్తం చేశా రు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎస్‌ఈసీ సత్వర స్పందనకు సంతోషిస్తున్నామని పేర్కొంది. పిల్‌ను నిరర్థకమైనదిగా ప్రకటిస్తూ డిస్పోజ్ చేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వు లు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ కేసులు, ఆస్తులు, విద్యార్హతలు, తదితర వివరాలకు సంబంధించి నామినేషన్ పత్రాలు, అఫిడవిట్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా ఎస్‌ఈసీని ఆదేశించాల ని కోరుతూ ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన వలపర్ల శివ కార్తిక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అభ్యర్థులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?