Share News

ఎస్టీ రిజర్వేషన్‌పై తగు ఉత్తర్వులు ఇవ్వండి

ABN , Publish Date - Nov 03 , 2026 | 04:58 AM

గ్రామపంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ)కు రిజర్వేషన్‌ ఖరారు విషయంలో అక్టోబరు 17న పిటిషనర్లు సమర్పించిన వినతిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని షెడ్యూల్డ్‌ ప్రాంతాల పరిధిలోని పలువురు రెవెన్యూ డివిజన్‌ అధికారు(ఆర్‌డీవో)లను హైకోర్టు ఆదేశించింది.

ఎస్టీ రిజర్వేషన్‌పై తగు ఉత్తర్వులు ఇవ్వండి

  • షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఆర్‌డీవోలకు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ)కు రిజర్వేషన్‌ ఖరారు విషయంలో అక్టోబరు 17న పిటిషనర్లు సమర్పించిన వినతిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని షెడ్యూల్డ్‌ ప్రాంతాల పరిధిలోని పలువురు రెవెన్యూ డివిజన్‌ అధికారు(ఆర్‌డీవో)లను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మండవ కిరణ్మయి సోమవారం వ్యాజ్యాన్ని పరిష్కరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వేషన్‌ ఖరారు చేసే విషయంలో అక్టోబరు 12న ప్రభుత్వం జీవో 154ను జారీ చేసింది.

దీంతో పాటు చట్ట నిబంధనలు అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ సవర చొక్కారావు, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పనపై షెడ్యూల్డ్‌ ప్రాంతాల పరిధిలోని ఆర్‌డీవోలకు వినతి ప్రత్రాలు ఇచ్చామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంచాయితీరాజ్‌శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్‌ కల్పన విషయంలో చట్టనిబంధనలు అనుసరిస్తామని స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 04:58 AM