ఎస్‌ఈసీ మార్గదర్శకాలు పాటించండి: హైకోర్టు
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:55 AM
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను ఆయా గ్రామాల్లోని కార్యాలయాల్లో కాకుండా వేరే ప్రాంతానికి మారుస్తున్నారంటూ వైసీపీ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు...
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాల స్వీకరణ కేంద్రాలను ఆయా గ్రామాల్లోని కార్యాలయాల్లో కాకుండా వేరే ప్రాంతానికి మారుస్తున్నారంటూ వైసీపీ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... కడప జిల్లా పెండ్లిమర్రి మండలం మచనూరు గ్రామం నుంచి మెయిలకల్వ గ్రామానికి, అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండల కేంద్రానికి నామినేషన్ కేంద్రాన్ని మారుస్తూ ఎంపీడీవోలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు విషయంలో ఎస్‌ఈసీ జారీ చేసిన హ్యాండ్‌బుక్ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని రిటర్నింగ్ అధికారులకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు
15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు