Share News

ఎవ్వరినీ వదలొద్దు

ABN , Publish Date - Sep 22 , 2026 | 03:47 AM

గురువులపై దాడి ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. దాడి చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుని ఆదేశించింది.

ఎవ్వరినీ వదలొద్దు

  • దాడిచేసిన వారిపై క్రిమినల్‌ కేసులు

  • దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన కూటమి సర్కార్‌

  • ఘటన వెనుక కుట్ర కోణంపై విచారణ!

అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): గురువులపై దాడి ఘటనను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. దాడి చేసిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టవద్దని విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుని ఆదేశించింది. మూకుమ్మడి దాడి, నిబంధనల ఉల్లంఘన, ర్యాలీకి అనుమతి లేకపోయినా నిర్వహించడంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సూచించింది. సీసీటీవీ, వీడియోఫుటేజ్‌ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ గ్యాంగ్‌ కర్రలు, రాడ్లు, కోడిగుడ్లు, రాళ్లు తీసుకురావడం వెనుక కుట్ర కోణం ఉందనీ అనుమానిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారిలో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రికి చెందిన రౌడీషీటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 03:47 AM