సచివాలయంపై డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం.. ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - May 08 , 2026 | 08:58 PM
రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో.. సచివాలయంపై 'డ్రోన్ కలకలం' అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది.
అమరావతి, మే 08: రాజధాని అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కలెక్టర్ల సదస్సు జరుగుతున్న సమయంలో.. సచివాలయంపై డ్రోన్ కలకలం అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా కీలకమైన సమయంలో ఇలాంటి పుకార్లు పుట్టించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
విజయవాడలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆకాశంలో కనిపించిన ఓ విమానాన్ని.. డ్రోన్‌గా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కలకలం రేపాయి. కలెక్టర్ల సదస్సు జరుగుతున్న వేళ భద్రతా వైఫల్యం జరిగిందంటూ విమర్శలు చేసే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న AI2903 విమానాన్ని చూపించి.. అది డ్రోన్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని పోలీసులు నిర్ధారించారు. సదరు విమానం నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ల్యాండింగ్ కోసం ఆ మార్గంలో ప్రయాణించిందని అధికారులు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పావలా వడ్దీకే రుణాలు: సీఎం చంద్రబాబు
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News