Share News

ఎన్నికల సిబ్బంది పారితోషికం పెంపు

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:05 AM

స్థానిక సంస్థల ఎన్నికల విధు ల్లో పాల్గొనే ఉద్యోగులకు పారితోషికాన్ని పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఎన్నికల సిబ్బంది పారితోషికం పెంపు

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల విధు ల్లో పాల్గొనే ఉద్యోగులకు పారితోషికాన్ని పెంచుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌/కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌కు గతంలో రోజుకు రూ.350లు ఇవ్వగా, ఇప్పుడు రూ.500కు పెంచారు. లేదా రూ.2 వేల మొత్తాన్ని చెల్లిస్తారు. పోలింగ్‌ ఆఫీసర్‌కు గతంలో రోజు కు రూ.250లు ఉండగా, ఇప్పుడు రూ.400కు పెంచారు.

లేదా రూ.1600 మొత్తంగా చెల్లిస్తారు. కౌంటింగ్‌ అసిస్టెంట్‌కు రోజుకు రూ.250 నుంచి రూ.450కు పెంచారు. లేదా 1350 చెల్లిస్తారు. మైక్రో అబ్జర్వర్లకు గతంలో రూ.1000 ఇవ్వగా, ఇప్పుడు రూ.2 వేలకు పెంచారు. సిబ్బందికి ప్యాక్‌డ్‌ లంచ్‌ కోసం రూ.500కు పెంచారు. అదే విధంగా నిఘా బృందాలకు చెందిన క్లాస్‌-1, క్లాస్‌-2 ఉద్యోగులకు రూ.1200ల నుంచి రూ.3 వేలకు, క్లాస్‌-3 ఉద్యోగులకు రూ.1000 నుంచి 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 02:05 AM