Share News

ప్రత్యేక ప్రదేశాల్లోనే ఆపరేషన్‌ దుస్తులు

ABN , Publish Date - Nov 10 , 2026 | 05:52 AM

ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రోగులకు ఇతర రోగుల నుంచి అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రత్యేక ప్రదేశాల్లోనే ఆపరేషన్‌ దుస్తులు

  • ఇతర రోగులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా చర్యలు

  • ప్రభుత్వ ఆస్పత్రులకు డీఎంఈ ఆదేశాలు జారీ

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రోగులకు ఇతర రోగుల నుంచి అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్‌ థియేటర్లు, అత్యవసర చికిత్స విభాగాల్లో విధులు నిర్వహించే వైద్యులు, పీజీ విద్యార్థులు, ఇంటర్న్‌లు, నర్సింగ్‌, ఇతర సిబ్బంది వినియోగించే ప్రత్యేక దుస్తులను నిర్దేశిత ప్రాంతాలకే పరిమితం చేయాలని డీఎంఈ డా.విష్ణువర్ధన్‌ ఆదేశించారు. ఆపరేషన్‌ విధులు ముగిసిన తర్వాత కూడా అవే దుస్తులతో సాధారణ వార్డులు, ఓపీడీలు, కారిడార్లు, కార్యాలయాలు, క్యాంటీన్లు, ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరగకూడదని స్పష్టం చేశారు.

ఈ అంశంలో ఇప్పటి వరకూ మౌఖికంగానే ఆదేశాలున్నాయి. లిఖితపూర్వకంగా తొలిసారిగా ఆదేశాలిచ్చారు. నిర్దేశిత ప్రాంతాల్లోకి ప్రవేశించే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించాలని పేర్కొన్నారు. ఇక ఆసుపత్రి పర్యవేక్షకులకు తగిన సంఖ్యలో ప్రత్యేక దుస్తులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రతి బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌ ఈ ఆదేశాల అమలుకు బాధ్యత వహించాలని తెలిపారు. ఇన్ఫెక్షన్‌ నియంత్రణ కమిటీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో డీఎంఈ స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 05:54 AM