Share News

చిన్నారుల రక్షణకు ప్రభుత్వం చర్యలు

ABN , Publish Date - Nov 15 , 2026 | 04:28 AM

రాష్ట్రంలో చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను నియమించింది. రాష్ట్రంలో చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టడం,...

చిన్నారుల రక్షణకు ప్రభుత్వం చర్యలు

  • అక్రమ రవాణా కట్టడికి జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీల ఏర్పాటు

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను నియమించింది. రాష్ట్రంలో చిన్నారుల అక్రమ రవాణాను అరికట్టడం, తప్పిపోయిన పిల్లల ఆచూకీ గుర్తించడం, వారిని రక్షించి తిరిగి కుటుంబాలకు అప్పగించడం, పునరావాసం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్‌గా రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి లేదా కార్యదర్శి ఉంటారు.

కో చైర్‌పర్సన్‌గా డీజీపీ, లేదా అదనపు డీజీపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ లేదా డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా ఉంటారు. వీరితోపాటు వివిధ శాఖల అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇద్దరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకూ చోటు కల్పించారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్పీ లేదా పోలీస్‌ కమిషనర్‌ కో చైర్‌పర్సన్‌గా, జిల్లా బాలల సంరక్షణ అధికారి మెంబర్‌ కన్వినర్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖల అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ జిల్లాల్లో తప్పిపోయిన పిల్లల కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అక్రమ రవాణా ముప్పు ఉన్న గ్రామాలు, ప్రాంతాలు, మార్గాలను గుర్తించడం, రక్షించిన చిన్నారులను బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరుపరచడం, గ్రామీ, జిల్లా స్థాయిల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీ బాధ్యతలు. జిల్లా కమిటీలు ప్రతి నెలా రాష్ట్ర కమిటీకి నివేదికలు పంపాలి.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 04:30 AM