పోషకాహార లక్ష్యాల పర్యవేక్షణకు కమిటీ
ABN , Publish Date - Nov 06 , 2026 | 05:59 AM
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార లోపాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిహన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా..
అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార లోపాల నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిహన్ సక్షమ్ అంగన్వాడీ, పోషణ్ 2.0 కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా రాష్ట్రస్థాయి మానిటరింగ్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు గురువారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 12 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పోషకాహార నిపుణులు సభ్యులుగా ఉంటారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
స్థానిక అవసరాలను బట్టి ఇతర సభ్యులను కూడా నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకోసారి కమిటీ సమావేశం నిర్వహిస్తారు. పోషకాహార లోపాలపై సమీక్ష, చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బరువు తగ్గడం, పోషకాహార సమస్యలను కమిటీ సమీక్షిస్తుంది. జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించేలా కమిటీ చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ