వైసీపీ పిటిషన్‌పై మా వాదనా వినండి
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:55 AM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వైసీపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలూ వినాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది.
స్థానిక ఎన్నికల్లో వార్డుల వ్యవహారంపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వ కేవియట్
న్యూఢిల్లీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై వైసీపీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలూ వినాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని రాష్ట్ర హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. అయితే, ‘సర్’ ప్రక్రియ పూర్తికాకుండానే, ఈ ఏడాది జనవరి నాటి ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా తీసుకుని హడావుడిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారంటూ వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున తక్షణమే విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరగా ఈ శుక్రవారం(రేపు) విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో తమ వాదనలను కూడా విన్న తర్వాతే తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం బుధవారం కేవియట్ దాఖలు చేసింది.
ఈ వార్తలనూ చదవండి..