Share News

దుష్ప్రచారమే వైసీపీ అజెండా!

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:32 AM

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాయి. పవన్‌, లోకేశ్‌ అధికారిక పర్యటనలకు ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏసీఎల్‌) నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని స్పష్టం చేశాయి.

దుష్ప్రచారమే వైసీపీ అజెండా!

  • సీఎం, డీసీఎం, మంత్రి లోకేశ్‌ విమాన ఖర్చులపై తప్పుడు ప్రచారం

  • లెక్కలతో సహా ఎండగట్టిన ప్రభుత్వ వర్గాలు

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు మండిపడ్డాయి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాయి. పవన్‌, లోకేశ్‌ అధికారిక పర్యటనలకు ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏసీఎల్‌) నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి వారు విమాన సేవలను వినియోగించుకోవడం లేదని వెల్లడించాయి. గవర్నర్‌, కేంద్ర మంత్రుల పర్యటనల హెలికాప్టర్‌ సేవలకయ్యే ఖర్చులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు కూడా ఏపీఏసీల్‌ పరిధిలోనే ఉంటాయని వివరించాయి. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికుల తరలింపునకు ప్రత్యేక విమాన ఖర్చులు ఇందులో నుంచే పెట్టామని తెలిపాయి.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా సీఎం జిల్లాల పర్యటనలకూ ఏపీఏసీఎల్‌ నుంచే ఖర్చు చేశామని వివరించాయి. 2026-27లో పీఏఏసీఎల్‌కు కేటాయించింది రూ.54.63 కోట్లు అయితే తొలి రెండు త్రైమాసికాలకు రూ.30.95 కోట్లు విడుదలయ్యాయని పేర్కొన్నాయి. మరోవైపు గత ప్రభుత్వంలో జిల్లాల పర్యటనలకు భారీగా ఖర్చు పెట్టారనే లెక్కలనూ ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. 2020-21లో కొవిడ్‌ ఆంక్షల సమయంలోనూ రూ.30 కోట్ల మేర విమానయాన ఖర్చులకు వినియోగించారని వెల్లడించాయి. ఎగ్‌ పఫ్‌లు, సమోసాలకు, ఇంటికి గ్రిల్స్‌ ఏర్పాటుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని గుర్తు చేశాయి.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:32 AM