2 విభాగాలకు స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకం
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:29 AM
ఏపీ హైకోర్టులో ఏపీఐఐసీ తరఫున న్యాయవాది తేలప్రోలు శ్రీచరణ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో కూడిన జోన్-3 పరిధిలోని కేసులకు సంబంధించి ఎండోమెంట్ ట్రైబ్యునల్ వాదనలు...
న్యాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో ఏపీఐఐసీ తరఫున న్యాయవాది తేలప్రోలు శ్రీచరణ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలతో కూడిన జోన్-3 పరిధిలోని కేసులకు సంబంధించి ఎండోమెంట్ ట్రైబ్యునల్ వాదనలు వినిపించేందుకు న్యాయవాది కొండ్రగంటి సుబ్బారావు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో కూడిన జోన్-4 పరిధిలోని కేసులకు సంబంధించి ఎండోమెంట్ ట్రైబ్యునల్ వాదనలు వినిపించేందుకు న్యాయవాది భీమవరపు శ్రీనివాసులు స్టాండింగ్ కౌన్సిళ్లుగా నియమితులయ్యారు. వీరి నియామకాలపై న్యాయశాఖ కార్యదర్శి జి.ప్రతిభాదేవి శుక్రవారం వేర్వేరుగా ఉత్తర్వులిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ