Share News

బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా

ABN , Publish Date - Nov 08 , 2026 | 01:20 AM

రాష్ట్రంలో బాణసంచా తయారీ కేంద్రాల పర్యవేక్షణ, సంస్థాగతంగా జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది.

బాణసంచా తయారీ కేంద్రాలపై నిఘా

  • రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బాణసంచా తయారీ కేంద్రాల పర్యవేక్షణ, సంస్థాగతంగా జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని రాయవరం, వేట్లపాలెంలో ఫైర్‌ వర్క్స్‌ తయారీ యూనిట్లలో పేలుళ్లు సంభవించి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ విధానపరమైన లోపాలను గుర్తించి, ప్రభుత్వానికి కొన్ని సూచనలిచ్చింది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం కీలక సవరణలు సూచించింది. రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో నోడల్‌ అధికారులను నియమించింది. రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారిగా రాష్ట్ర విపత్తుల సంస్థ డైరెక్టర్‌ను నియమించింది. పేలుడు పదార్థాలు, బాణసంచా భద్రతా విభాగాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. అలాగే జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా బాణసంచా భద్రతా కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షునిగా ఉంటారు. కమిటీ ప్రతి మూడు నెలలకొకసారి సమీక్ష చేయాలి.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 01:22 AM