మరో 10 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 11 , 2026 | 03:44 AM
విశాఖలో గురు, శుక్రవారాల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరో రూ.10,50,970 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
విశాఖ సదస్సులో భారీగా పెట్టుబడులకు అవకాశం
10.77 లక్షల ఉద్యోగాలకు చాన్స్: సీఎం
ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రానికి 31 లక్షల కోట్ల పెట్టుబడులు
వీటి ద్వారా 25 లక్షల ఉద్యోగాలొస్తాయ్
పెట్టుబడుల గ్రౌండింగ్‌పైనే దృష్టి పెట్టాం
ఫిబ్రవరి 3న క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభం
ప్రధాని టైమివ్వగానే ముహూర్తం ఖరారు
ధరల భారం ప్రజలపై పడకూడదు
నిత్యావసరాలను రైతు బజార్లలో ఉంచాలి
ఇక ప్రతి క్యాబినెట్‌లో వీటిపై చర్చ
కూటమిపై ప్రజల్లో సానుకూలత
‘స్థానిక’ గెలుపును తలకెక్కించుకోవద్దు
జనవరిలో సహకార ఎన్నికలకు వెళ్దాం
మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు ఉద్బోధ
కూటమి ప్రభుత్వ పనితీరుకు ‘యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్’ గణాంకాలే నిదర్శనం. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీ రెండో స్థానంలో ఉండడం గర్వించదగిన విషయం. డ్వాక్రా, మెప్మా పనితీరు విషయంలో మన రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచింది. ఇది వ్యక్తిగతంగా నాకెంతో సంతోషాన్నిచ్చింది.
ధరల నియంత్రణపై ఈ 3 నెలల్లో రూ.300 కోట్ల వరకు ఖర్చు పెట్టాం. జీఎస్‌డీపీ (స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి)ని 15 శాతానికి తీసుకురావడంపైనా మంత్రులు దృష్టి సారించాలి. ఇకపై ప్రతి క్యాబినెట్‌లోనూ ధరల పెరుగుదల, జీఎస్‌డీపీపై చర్చ జరగాలి.
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విశాఖలో గురు, శుక్రవారాల్లో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో మరో రూ.10,50,970 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వీటి ద్వారా సుమారు 10,77,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. దీనితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు అవుతుందని, సుమారు 25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అన్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో అజెండా అంశాలపై చర్చ అనంతరం స్థానిక ఎన్నికల్లో విజయాలు, ధరల నియంత్రణ తదితర అంశాలపై మంత్రివర్గ సహచరులతో ఆయన చర్చించారు. కేవలం రెండున్నరేళ్లలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం కూటమి ప్రభుత్వ కృషికి అద్దం పడుతోందన్నారు.
వచ్చిన పెట్టుబడులన్నీ గ్రౌండయ్యేలా చూడడంపైనే దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఎస్ర్కో అకౌంట్ తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. అమరావతిలో దేశంలోనే తొలి క్యాంటమ్ కంప్యూటర్‌ను ఫిబ్రవరి 3న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని భావిస్తున్నామని.. ఆయన సమయం కోరామని.. టైం కేటాయించిన వెంటనే క్వాంటం కంప్యూటర్ ప్రారంభోత్సవ ముహూర్తాన్ని అధికారికంగా ఖరారు చేస్తామని వెల్లడించారు.
ధరల నియంత్రణపై దృష్టి పెట్టండి
నిత్యావసర ధరల పెరుగుదలపై మంత్రులందరూ దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ధరల పెరుగుదల భారం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలపై పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే రైతు బజార్లలో నిత్యావసరాలను అందుబాటులో ఉంచాలని, ఇప్పటికే బియ్యానన్ని అందుబాటు ధరలో ఉంచామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో రైతు బజార్లలో అందుబాటు ధరలో బియ్యాన్ని విక్రయించేది ఏపీ ఒక్కటేనన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!