రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:49 AM
పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది.
వైద్యసేవల విస్తృతికి ఆర్టీసీ నిర్ణయం
ఆరేళ్లలో 10,249 మంది పదవీ విరమణ
వారిలో 7,844 మందే ఈ పథకంలోకి..
మిగిలిన వారికీ అవగాహన కల్పించాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
వైద్యసేవల విస్తృతికి ఆర్టీసీ నిర్ణయం
విజయవాడ(బ్‌సస్టేషన్), నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది. అందులో భాగంగా అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులందరినీ ఈహెచ్‌ఎస్‌లో చేర్చేందుకు చర్యలు చేపట్టింది. 2020 జనవరి 1 నుంచి 2026 అక్టోబరు వరకు మొత్తం 10,249 మంది ఉద్యోగులు పదవి విరమణ చేయడం లేదా ఇతర కారణాలతో సర్వీసు నుంచి వైదొలగడం జరిగింది. వీరిలో ఇప్పటివరకు 7,844 మంది మాత్రమే ఈహెచ్‌ఎస్‌లో నమోదు చేసుకున్నారు.
మిగిలిన ఉద్యోగులను కూడా ఈ పథకంలో చేర్చేందుకు ఆర్టీసీ సంస్థ కార్యాచరణ రూపొందించింది. ఈహెచ్‌ఎస్ కింద ఎంప్యానల్ అయిన ఆస్పత్రులతో పాటు ఆర్టీసీ వైద్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఓపీ విభాగంలో వైద్యుల సంప్రదింపులు, చికిత్స, వైద్య పరీక్షలు, మందుల సరఫరా వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ పథకంపై రిటైర్డ్ ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ప్రతి డిపోలో నెలకు రెండో మంగళవారం, బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని యూనిట్ అధికారులను సంస్థ యాజమాన్యం ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి: