6,791 ప్రభుత్వ భవనాలపై సోలార్
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:30 AM
ప్రభుత్వ భవనాలు, సంక్షేమ సంస్థల్లో సోలార్ విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు.
సూర్యఘర్ అమలులో వేగాన్ని పెంచాలి
సమీక్షలో ఇంధన శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భవనాలు, సంక్షేమ సంస్థల్లో సోలార్ విద్యుత్తు వ్యవస్థల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పీఎం సూర్యఘర్ అమలుపై మంగళవారం విద్యుత్తు సౌధలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్, డిస్కంల సీఎండీలు లోతేటి శివశంకర్, పృధ్వీతేజ్ ఇమ్మడి, పొగాకు పుల్లారెడ్డి, నెడ్‌క్యాప్ వీసీఎండీ కమలాకరబాబు పాల్గొన్నారు. విజయానంద్ మాట్లాడుతూ.. ‘3,859 ప్రభుత్వ భవనాల్లో 120.40 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్తు వ్యవస్థలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటితోపాటు వివిధ సంక్షేమ శాఖలకు చెందిన 2,932 భవనాలపై కూడా ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు