ఇంధన పొదుపు అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Nov 15 , 2026 | 01:03 AM
రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష కృషి చేస్తున్న సంస్థలను
అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం పెంపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కర్బన ఉద్గారాల తగ్గింపులో విశేష కృషి చేస్తున్న సంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇంధన పొదుపు పురస్కారాలను అందిస్తోంది. ఈ ఏడాది ఈ పురస్కారాల కోసం పరిశ్రమలు, ఇంధన పొదుపు, ఉద్గారాల తగ్గింపునకు దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా అమలు చేసిన సంస్థలు వంటి వివిధ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంధన పొదుపు, సామర్థ్యం పెంపు దిశగా ఆయా సంస్థలు సాధించిన విజయాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ పురస్కారాల లక్ష్యమని ఏపీ ఇంధన పొదుపు మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో నాగలక్ష్మి తెలిపారు. దరఖాస్తులను ఏపీఎస్ఈసీఎం అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని ఆమె తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం