Share News

పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టండి

ABN , Publish Date - Nov 21 , 2026 | 01:30 AM

: ‘స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా

పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టండి

  • పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడండి: పునేఠా

అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి కమిషన్‌ కార్యదర్శి మల్లికార్జున, శాంతిభద్రతల ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, ఐజీ బి.రాజకుమారితో పాటు కడప, పల్నాడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ఎన్నికలను ప్రభావితం చేసే శక్తులపై నిఘా ఉంచాలన్నారు. అవాంఛనీయ సంఘటలకు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుని, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పించాలన్నారు.

వేంపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక ఏర్పాట్లు...

వేంపల్లి గ్రామ పంచాయతీలో అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు పోలీసు భద్రత కల్పించాలని కమిషనర్‌ సూచించారు. ఆర్వో కార్యాలయ ప్రాంగణంలోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించడం, సీసీటీవీ నిఘా ఏర్పాటు వంటి అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించి, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై అక్వాన్‌ తుఫాను ప్రభావం, వాతావరణ పరిస్థితుల వివరాలను కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. ప్రతికూల వాతావరణం ఏర్పడినా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి

తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి

Updated Date - Nov 21 , 2026 | 01:33 AM