Share News

డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:34 PM

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధమేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే వైసీపీ సీబీఐపై తన నమ్మకాన్ని నిరూపించుకోవాలని, అందుకు రెండు షరతులు అంగీకరించాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
DSC Recruitment CBI inquiry

అమరావతి, సెప్టెంబర్ 26: డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ చేస్తున్న డిమాండ్‌పై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. డీఎస్సీ ప్రక్రియ అత్యంత పకడ్బందీగా జరిగిందని.. 16,372 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎక్కడా అక్రమాలకు తావివ్వలేదని స్పష్టం చేశారు. సీబీఐపై వైసీపీకి అంత నమ్మకం ఉంటే.. విచారణకు తాము కూడా సిద్ధమేనని, అయితే ముందుగా తాను పెట్టిన షరతులను అంగీకరించాలని అన్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు తమ ప్రభుత్వం.. మంత్రి నారా లోకేశ్‌ భయపడటం లేదని పేర్కొన్నారు. ఐదేళ్ల తర్వాత భారీ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంతో వైసీపీ నేతలు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శించారు.


జగన్‌ అక్రమాస్తుల కేసులు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై వైసీపీ వైఖరిని సోమిరెడ్డి ప్రశ్నించారు. గతంలో సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో వెల్లడైన అంశాలను వైసీపీ అంగీకరించాలని, వివేకా హత్య కేసులో సీబీఐ నిందితులుగా పేర్కొన్న వారిని కోర్టుకు సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీబీఐ కోర్టుకు సమర్పించిన వాస్తవాలను అంగీకరించి, దర్యాప్తుపై దాఖలు చేసిన కౌంటర్లను వెనక్కి తీసుకోవాలని షరతు విధించారు. ఈ రెండు జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒప్పించి డీఎస్సీపై సీబీఐ విచారణకు సిద్ధం చేస్తానని సోమిరెడ్డి ప్రకటించారు. విచారణ అనంతరం క్లీన్‌చిట్ వచ్చినా వైసీపీ మళ్లీ అనుమానాలు వ్యక్తం చేస్తుందని ఆయన ఆరోపించారు.


ఇవి కూడా చదవండి...

2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ‘ది గోదావరి కాల్స్‌’ ప్రచారం: మంత్రి దుర్గేష్

దుర్గగుడి ఘాట్‌రోడ్డుకు శాశ్వత రక్షణ చర్యలు.. దసరాకు సురక్షితంగా ఉండేలా ఆదేశాలు

Read Latest AP News And Telangana News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 06:52 PM