డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:50 AM
డీఎస్సీ-2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా 2,721 పోస్టులను భర్తీ చేయనుంది.
2721 పోస్టుల భర్తీకి ప్రక్రియ.. 11 నుంచి దరఖాస్తులు
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2026 పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ బుధవారం అర్థరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదల చేసిన షార్ట్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా 2,721 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్, 200 ఎస్‌జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 260 ఉన్నాయి. ఈ నెల 11 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్