నేడు పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:53 AM
కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు.
1500 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
రేపు కాకినాడలో జనసేన ఎన్నికల సన్నాహక సమావేశం
పిఠాపురం, అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేరళంలో చికిత్స అనంతరం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడంతో పాటు రూ.1500 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంగళవారం పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం ఆవరణలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు.
ఈ వార్తలనూ చదవండి..