Share News

ప్రజలంతా ఏకమైతే ఏ దీపాన్నీ ఎవ్వరూ ఆర్పలేరు

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:11 AM

తిరుప్పరంకుండ్రంలో దీపం వెలగడంతో నేడు ప్రతి భక్తుని హృదయం ఆనందంతో వెలిగిపోతోందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

ప్రజలంతా ఏకమైతే ఏ దీపాన్నీ ఎవ్వరూ ఆర్పలేరు

  • ధర్మమే మనందరినీ కలిపే ఉమ్మడి బంధం

  • ‘తిరుప్పరంకుండ్రం దీపం’పై ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్‌

తిరుప్పరంకుండ్రంలో దీపం వెలగడంతో నేడు ప్రతి భక్తుని హృదయం ఆనందంతో వెలిగిపోతోందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. దీపం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, పోరాడిన ప్రతి న్యాయవాదికీ - ముఖ్యంగా జె.సాయిదీపక్‌కు, ఓపికతో ప్రశాంతంగా వేచి ఉన్న వారందరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్‌ వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘ఈ దీపం మన నాగరికతకు, మన విశ్వాసానికి, మన సంస్కృతికి ప్రతీక. కులం, భాష, ప్రాంతం అనేవి కేవలం మనం మోసే పేర్లు మాత్రమే. కానీ ధర్మం (తమిళంలో ‘అరం’) అనేది మనందరినీ కలిపే ఉమ్మడి బంధం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకూ ఉన్న భారతీయులందరి కోసం ఈ కొండపై దీపం వెలిగింది. ప్రజలందరూ ఏకమైనప్పుడు మన ఏ దీపాన్నీ ఎవ్వరూ ఆర్పలేరు. వెట్రివేల్‌ మురుగనుక్కు.. హరోహరా’ అని పవన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 01:12 AM