గ్యాస్ బ్లో అవుట్‌పై పవన్ ఆరా
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:42 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు.
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. బ్లో అవుట్ తీవ్రత, పరిసర గ్రామాల ప్రజల భద్రత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఇటీవల తరచూ గ్యాస్ లీకేజీ ఘటనలు చోటుచేసుంటున్న నేపథ్యంలో ఓఎన్జీసీ చైర్మన్, ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు