Share News

అంధ విద్యార్థినిని కలిసిన పవన్‌

ABN , Publish Date - Sep 23 , 2026 | 04:01 AM

‘‘పవనన్నా నిన్ను కలవాలన్నా..’’ అన్న అంధ విద్యార్థిని స్వాతి ఆకాంక్షను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నెరవేర్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపోడుకు చెందిన నల్ల స్వాతి తన తండ్రితో కలిసి పిఠాపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద సోమవారం పవన్‌ను కలవాలని ఉందంటూ ప్లకార్డు ప్రదర్శించారు.

అంధ విద్యార్థినిని కలిసిన పవన్‌

  • వేమన పద్యంతో ఆకట్టుకున్న చిన్నారి

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

పిఠాపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘పవనన్నా నిన్ను కలవాలన్నా..’’ అన్న అంధ విద్యార్థిని స్వాతి ఆకాంక్షను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నెరవేర్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ముమ్మిడివారిపోడుకు చెందిన నల్ల స్వాతి తన తండ్రితో కలిసి పిఠాపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద సోమవారం పవన్‌ను కలవాలని ఉందంటూ ప్లకార్డు ప్రదర్శించారు. ఈ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం వచ్చిన వార్తపై పవన్‌ స్పందించారు. స్వాతిని తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీంతో తన తండ్రితో కలిసి స్వాతి బుధవారం పిఠాపురంలో జరిగిన సభావేదిక వద్దకు చేరుకుని పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేమన శతకంలోని పద్యాన్ని స్వాతి ఆలపించి, అర్థాన్ని వివరిస్తూ అందులోని గుణగణాలన్నీ పవన్‌కల్యాణ్‌లో ఉన్నాయని తెలిపింది. మురిసిపోయిన పవన్‌ ఆమెను అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి...

పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Updated Date - Sep 23 , 2026 | 04:05 AM