Share News

నేడు కోనసీమకు ముఖ్యమంత్రి

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:26 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పర్యటించనున్నారు. గ్రౌండ్‌ రెంట్‌ భూములకు 22ఏ నుంచి విముక్తి కల్పించిన నేపథ్యంలో లబ్ధిదారులతో సమావేశమవుతారు.

నేడు కోనసీమకు ముఖ్యమంత్రి

అమలాపురం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో పర్యటించనున్నారు. గ్రౌండ్‌ రెంట్‌ భూములకు 22ఏ నుంచి విముక్తి కల్పించిన నేపథ్యంలో లబ్ధిదారులతో సమావేశమవుతారు. నేరుగా వారి నివాసాలకే వెళ్లి ప్రభుత్వ నిర్ణయం గురించి వారికి తెలియజేస్తారు. మాచవరం పంచాయతీ పరిధిలోని జయంతినగర్‌లో రైతులను కలసి ముచ్చటిస్తారు. వారికి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలను అందజేస్తారు. అనంతరం మాచవరం పండువారిపేటలో ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, కోనసీమ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌ మీనా పర్యవేక్షిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి...

‘అభివృద్ధికి అక్షరాస్యత దోహదం’

బ్యాంకుకు రమ్మంటే భర్త రాలేదని..

Updated Date - Sep 09 , 2026 | 05:26 AM