Share News

నేడు ప్రకాశంలో సీఎం పర్యటన

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:28 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రకాశం జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొంటారు.

నేడు ప్రకాశంలో సీఎం పర్యటన

ఒంగోలు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రకాశం జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్శింగోలు గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజావేదిక కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి మాట్లాడటంతోపాటు గ్రామసభలో పాల్గొంటారు. పీ4 పథకం కింద ఎంపిక చేసిన ఒక బంగారు కుటుంబాన్ని సందర్శించే అవకాశం ఉంది. నియోజకవర్గంలో రీసర్వే పూర్తిచేసిన గ్రామాల్లోని 8 వేలకు పైగా పట్టాదారు పాసుపుస్తకాలను ప్రజావేదిక సభలో రైతులకు పంపిణీ చేయనున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో మధ్యాహ్నం సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా, పాలేరు రిజర్వాయర్‌ స్పిల్‌వే, ప్రధాన తూముల నిర్మాణ పనులు, అలాగే ముప్పాళ్ల వద్ద పాలేరు నదిపై రూ.28.80 కోట్లతో నిర్మించనున్న వంతెననిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:28 AM