Share News

డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి జలధారకు శ్రీకారం

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:32 AM

మా సిద్ధాంతం అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలబెట్టడం. కానీ గొడ్డలిపార్టీ సిద్ధాంతం కుట్రలు, ఫేక్‌ ప్రచారాలు, హింసా రాజకీయాలు.. నేరాలు చేయడం, వాటిని ఎదుటివారిపై వేయడం వారి డీఎన్‌ఏలోనే ఉంది. వివేకా హత్య నుంచి లిక్కర్‌ స్కాం వరకు,

డిప్యూటీ సీఎం పవన్‌తో కలిసి జలధారకు శ్రీకారం

ఐదేళ్లలో కడపకు జగన్‌ ఏం చేశారో చెప్పాలి

మా సిద్ధాంతం అభివృద్ధి, ఈ రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలబెట్టడం. కానీ గొడ్డలిపార్టీ సిద్ధాంతం కుట్రలు, ఫేక్‌ ప్రచారాలు, హింసా రాజకీయాలు.. నేరాలు చేయడం, వాటిని ఎదుటివారిపై వేయడం వారి డీఎన్‌ఏలోనే ఉంది. వివేకా హత్య నుంచి లిక్కర్‌ స్కాం వరకు, సింగయ్యను కారుతో తొక్కించడం నుంచి మాజీ మంత్రి కొడుకును యాక్సిడెంట్‌ కేసు నుంచి తప్పించడం, బలవంతంగా మతమార్పిడి వరకు.. రాజకీయాలు సబబా? జగన్‌ ఐదేళ్లు అధికారంలో ఉండి కడపకు ఏంచేశారో చెప్పాలి. మేం గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌తో ముందుకెళ్తున్నాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, రిలయన్స్‌ ఈడీవచ్చి సహకరిస్తే విమర్శలా?

తిరుగులేని సీమగా మారుస్తాం

నేను కూడా రాయలసీమ బిడ్డనే. సీమను తిరుగులేని సీమగా మారుస్తాం. స్పేస్‌ పరిశ్రమలు వస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో నెలకు రెండు శాటిలైట్స్‌ను ఇక్కడి నుంచే ప్రయోగిస్తాం. కడప ఇన్నోవేషన్‌ హబ్‌ను కలెక్టర్‌ తయారు చేశారు. ఇప్పుడు మనం కూలీలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. హబ్‌కు వెళ్లి సేవలందించే పరిస్థితి వస్తుంది. కులం చూడొద్దు.. మతంవైపు వెళ్లవద్దు.. రాయలసీమ అభివృద్ధి మన లక్ష్యం.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 04:32 AM