సమీక్షల నుంచి క్షేత్ర స్థాయికి!
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:19 AM
రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో పగలు సమీక్షలు.. క్యాంపు కార్యాలయం నుంచి అర్ధరాత్రులు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతో సీఎం చంద్రబాబు సరిపెట్టలేదు. క్షేత్ర స్థాయికి వెళ్లి..
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో పగలు సమీక్షలు.. క్యాంపు కార్యాలయం నుంచి అర్ధరాత్రులు టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించడంతో సీఎం చంద్రబాబు సరిపెట్టలేదు. క్షేత్ర స్థాయికి వెళ్లి.. వరుస తుఫాన్లతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. అర్నబ్, మురసు తుఫాన్లతో నీట మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, జలదిగ్బంధంలో ఉన్న ఊళ్లను స్వయంగా పరిశీలించారు.
వాతావరణం అనుకూలించని ప్రాంతాల్లో హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ విలయాన్ని తెలుసుకున్నారు. అర్నబ్ తుఫాను సమయంలో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరి, కొబ్బరి, ఆక్వా రైతుల నష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. తాజాగా మురసు కారణంగా దెబ్బతిన్న బాపట్ల, గుంటూరు జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా అక్కడకు వెళ్లి విన్నారు. వరద ముంపు ప్రాంతాలను, పంట నష్టాన్ని కళ్లారా చూశారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు